పరిస్థితులను అర్థం చేసుకోవాలి: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: టీఎన్జీవో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రాజేందర్ గురువారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలో సీఎంతో భేటీ ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా టీఎన్జీవోలు ఉండాలని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Advertisement