మిడతల దండుపై సీఎం లేఖ

దిశ, వెబ్ డెస్క్: మిడతల బెడదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. తన జీవితంలో గత ముప్పై ఏళ్ల క్రితం మిడుదల దండు చూశానని.. ప్రస్తుతం రాజస్థాన్‌లో మిడుతల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు మూడు జిల్లాలో మినహా మిగతా జిల్లాలో మిడతలు తీవ్రంగా నష్టం చేశాయన్నారు. రైతులకు నష్ట పరిహారంపై సర్వేచేసిన తరువాతే పంపిణీ చేస్తామన్నారు.

Advertisement