- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గీతా ఆర్ట్స్‌తో రాజశేఖర్.. ఏమా కథ ?
పలాస 1978.. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పలాస మార్కెట్ గొడవల నేపథ్యంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను చూసిన నిర్మాత అల్లు అరవింద్.. దర్శకుడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. వెంటనే తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చిన అరవింద్.. భవిష్యత్‌లో గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలని ఆశీర్వదించాడు.
ఆయన ఆశీర్వచనం గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కరుణ కుమార్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కే చాన్స్ ఉందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో రాజశేఖర్ హీరోగా నటించబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా చేయడంలో అల్లు అరవింద్ ప్రధాన ఉద్దేశం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్‌లను దగ్గర చేయడమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవ కారణంగా చిరు, రాజశేఖర్‌ల మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.
కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా వచ్చిందంటే దాదాపు సూపర్ హిట్ అనే బ్రాండ్ పడిపోయింది. మరి ఈ చిత్రంతో రాజశేఖర్ హిట్ కొడతాడా లేదా చూడాలి.