అల్పపీడనంతో మరో రెండు రోజులపాటు వర్షాలు

by srinivas |
అల్పపీడనంతో మరో రెండు రోజులపాటు వర్షాలు
X

దిశ, ఏపీ బ్యూరో: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు. గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నందున ఆయా జిల్లా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల, లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed