- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరో రెండ్రోజులు వర్షాలు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 74.5, కరీంనగర్ జిల్లాలో 73.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.0, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68.8 మి.మి. వర్షం కురిసింది. జీహెచ్‌హెంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.