భారీ వర్షం.. టీమ్ ఇండియా ప్రాక్టీస్‌కు బ్రేక్

by Shyam |
భారీ వర్షం.. టీమ్ ఇండియా ప్రాక్టీస్‌కు బ్రేక్
X

దిశ, స్పోర్ట్స్ : మెల్‌బోర్న్‌లో భారీ వర్షం కురియడంతో ఎంసీజీ మైదానంలో టీమ్ ఇండియా క్రికెటర్ల సాధనకు అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో క్రికెటర్లు ఇండోర్‌లో సాధన చేశారు. నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన కుదరక పోవడంతో ఇండోర్‌లో ఫిట్‌నెస్ పెంచుకునే కసరత్తులకే పరిమితం అయ్యారు. వర్షం కారణంగా నెట్ ప్రాక్టీస్‌ చేయలేదని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

జనవరి 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు సోమవారం మెల్‌బోర్న్ నుంచి ప్రయాణం కానున్నారు. కాగా, రోహిత్ శర్మ సహా మరో నలుగురు క్రికెటర్లను విడిగా ఐసోలేషన్‌లో ఉంచారు. న్యూ ఇయర్ సందర్భంగా వాళ్లు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్‌కు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ దీన్ని కొట్టిపారేసినా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం దీనిపై విచారణ చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed