- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంటార్కిటికా కింద పెద్ద అడవి?
దిశ, వెబ్‌డెస్క్:
90 మిలియన్ సంవత్సరాల క్రితం పడమర అంటార్కిటికాలో పెద్ద అడవి ఉండేదని, అక్కడ దొరికిన శిలాజాలను పరిశోధన ద్వారా తెలిసింది. క్రెటాషియస్ కాలంలో (145 మిలియన్ నుంచి 65 మిలియన్ ఏళ్ల క్రితం) డైనోసార్లు ఈ అడవిలో తిరుగుతూ, సముద్రమట్టం ఎత్తు 558 అడుగులు, అలాగే ఉష్ణోగ్రతలు 95 డిగ్రీలు ఉండేదని ఈ అధ్యయనంలో తెలిసింది.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్నటువంటి అడవులే ఒకప్పుడు అంటార్కిటికాలో ఉండేదని జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఇనిస్టిట్యూట్ హెల్మహోల్డ్‌జ్ సెంటర్ వారి అధ్యయనంలో తెలిసింది. 2017లో పడమటి అంటార్కిటికాలోని పైన్ ఐలాండ్ గ్లేసియర్ వద్ద ఈ అడవికి సంబంధించిన శిలాజాలు దొరికాయి. వాటిని పరిశోధన చేసిన తర్వాత అక్కడ ఒకప్పుడు వర్షాధార అడవి ఉండేదని కనుక్కున్నారు. కంప్యూటర్ టోమోగ్రఫీ స్కానర్ ద్వారా ఆ ప్రాంతంలో పూల మొక్కలుకూడా ఉన్నాయని అక్కడ దొరికిన స్పోర్లు, పొలెన్ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో వర్షాలు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నట్లుగానే ఉండేవని సీనియర్ పరిశోధకుడు ఉల్రిచ్ సాల్జ్మన్ తెలిపారు.
Tags: Antarctica, NewZealand, Island, glacier, Rain forest