రైల్వే‌లో బుకింగ్‌ల కంటే రిఫండ్‌లే అధికం

by  |
రైల్వే‌లో బుకింగ్‌ల కంటే రిఫండ్‌లే అధికం
X

న్యూఢిల్లీ: 167ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో రైల్వే తొలిసారిగా ప్రయాణికుల నుంచి ఆర్జించకుండా తిరిగి చెల్లించిన మొత్తాలే అధికంగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనాతో ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. మహమ్మారిని కట్టడి చేయడానికి రైల్వే సేవలన్నీ ఉన్నఫళంగా నిలిచిపోయాయి. అప్పటికే బుక్ చేసుకున్నవారందరికీ రిఫండ్ చేయడంతో ఆదాయం కంటే తిరిగి చెల్లించిన మొత్తాలే ఈ త్రైమాసికంలో అధికంగా రిపోర్ట్ అయ్యాయి.

రిఫండ్‌లే అధికంగా ఉండటంతో రాబడి నెగెటివ్‌లో నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తుతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఏప్రిల్‌లో రూ. 531.12కోట్లు, మేలో రూ. 145.24కోట్లు, జూన్‌లో రూ. 390.6కోట్ల నెగెటివ్ లాభాలు నమోదయ్యాయని ఆర్టీఐ సమాధానం వెల్లడించింది. టికెట్ బుకింగ్‌ల కంటే రిఫండ్‌లు అధికంగా ఉండటం మూలానే లాభం నెగెటివ్‌లలో కనిపిస్తున్నదని రైల్వే శాఖ ప్రతినిధి డీజే నారాయణ్ తెలిపారు. కరోనా కారణంగా రైల్వే సేవలను నిలిపేసి రిఫండ్ చేయడంతో ఈ రుణాత్మక ఫలితాలు వచ్చాయని నిపుణలుు అభిప్రాయపడుతున్నారు.


Next Story