రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. టికెట్లపై భారీ డిస్కౌంట్స్

by Anukaran |   ( Updated:2021-06-14 09:21:43.0  )
రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. టికెట్లపై భారీ డిస్కౌంట్స్
X

న్యూఢిల్లీ: ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. యూపీఐ, భీమ్ ఇంటర్ ఫేస్‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ఇచ్చే పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 12వరకు ప్రయాణీకులకు వర్తిస్తుందని తెలిపింది. కాగా ఈ ఇంటర్ ఫేస్‌ల ద్వారా కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకునే వారికే ఈ పథకం వర్తిస్తుందని రైల్వే తెలిపింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి ఈ స్కీమ్ వర్తించదని వెల్లడించింది.

2017 డిసెంబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ, భీమ్ ఇంటర్ ఫేస్‌ల ద్వారా చెల్లింపులను భారత రైల్వే అంగీకరిస్తోంది. అప్పటి నుంచి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్) కౌంటర్ల వద్ద బుక్ చేసుకునే టికెట్ల ప్రాథమిక చార్జీల మొత్తంపై 5 శాతం డిస్కౌంట్(గరిష్టంగా 50 రూపాయల వరకు) డిస్కౌంట్‌ను రైల్వే అందిస్తోంది. అయితే ప్రయాణీకులు బుక్ చేసుకునే టికెట్ ప్రాథమిక చార్జీల మొత్తం కనీసం రూ.100 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలనే నిబంధన ఉంది.

Advertisement

Next Story

Most Viewed