తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో రిటైల్ పరిశ్రమ : ఆర్ఏఐ!

by Harish |
తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో రిటైల్ పరిశ్రమ : ఆర్ఏఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రిటైల్ పరిశ్రమలోని కార్మికులు, వ్యాపారులకు అత్యవసర సహకారం అవసరమని రిటైలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) గురువారం ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్ ఆంక్షలు అనేక రాష్ట్రాలకు విస్తరిస్తున్న సమయంలో చిల్లర వ్యాపారులు ఉద్యోగులను కాపాడుకోవడం, వారి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టమవుతున్న నేపథ్యంలో పరిశ్రమలో నిధుల లభ్యత పెంచడం అవసరమని ఆర్ఏఐ తెలిపింది.

‘లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు మూసివేసినప్పటికీ చిన్నాచితక వ్యాపారులు జీతాలు, విద్యుత్ బిల్లులు, అద్దె, ఆస్తి పన్ను మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలో నగదు చెల్లింపులు ఆగిపోవడంతో నిర్వహణ ఖర్చుల్లో మార్పులేమీ లేవని’ ఆర్ఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉందని, జీవనోపాధి దెబ్బతిన్నదని, కొందరి వ్యాపారాలు దివాలా దశలో ఉన్నాయని తెలిపింది. ఈ పరిణామాలతో ఎంఎస్ఎంఈ సరఫరాదారులకు ఎలాంటి చెల్లింపులను చేయలేకపోతున్నారని ఆర్ఏఐ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed