- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో అరంగేట్రం.. ప్రస్థానంలో అరుదైన రికార్డులు
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మొత్తం ఆ నలుగురి వైపే చూస్తోంది. అనతి కాలంలో ఒకరు, సుదీర్ఘ ప్రయాణంలో మరొకరికి దేశం తరఫున ఆడేందుకు అవకాశం వచ్చింది. మొత్తానికి ఏండ్లుగా శ్రమించిన నలుగురు యువఆటగాళ్ల కళ నెరవేరబోతోంది. ఇక అరంగేట్రంలో అద్భుతాలు సృష్టిస్తే జాతీయ జట్టులో స్థానం పదిలం. అంతేకాదు కీలక ఆటగాళ్లుగా నిలిచే సత్తా వారిది. టీమిండియాలో సంచలనంగా మారిన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియా ఒకే సారి అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిపై వార్తలు వైరస్‌లా వ్యాపించాయి. అటువంటి ఆటగాళ్ల ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది.. భారత జట్టులో స్థానం సంపాదించడంలో వారికి ఆసరాగా నిలిచిన ప్రత్యేక మ్యాచులపై స్పెషల్ స్టోరీ.
వరుణ్ చక్రవర్తి.. 2018 నుంచి తమిళనాడు తరఫున దేశవాలీ మ్యాచులతో క్రికెట్ లైఫ్ స్టార్ట్ చేశాడు. గత మూడేళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫిలో రాణించిన చక్రవర్తి 2019లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుత పంజాబ్ కింగ్స్) జట్టులో తొలి ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని కొనుగోలు చేసింది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన(5/20)కు తోడు.. పలు కీలక మ్యాచుల్లో మంచి ఎకానమీ నమోదు చేశాడు. దీంతో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టూర్‌కు సెలెక్ట్ అయ్యాడు. కానీ, గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో బీసీసీఐ అవకాశం ఇవ్వడంతో గాయపడ్డ సింహాలా చెలరేగుతాడని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.
ఇషాన్ కిషన్.. 2014లో జార్ఖండ్ క్రికెట్ టీమ్ తరఫున డొమెస్టిక్ మ్యాచుల్లో రాణించిన ఇషాన్ కిషన్ అనతి కాలంలోనే గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 2016-17 సమయంలో గుజరాత్ లయన్స్ జట్టులో చోటు సంపాదించి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2018లో ముంబై ఇండియన్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసి.. 2021 వరకు అట్టిపెట్టుకుంది అందుకు అతడి సామర్థ్యాలే ప్రధాన కారణం. ఎందుకంటే అద్భుత స్ట్రైక్ రేట్‌ను మెయింటేన్ చేస్తూ ఇషాన్ కిషన్ ప్రత్యర్థులకు పెను సవాల్‌గా మారాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇటీవల జరిగిన విజయ హజారే ట్రోఫీలో అయితే 94 బంతుల్లోనే 19 ఫోర్లు, 11 సిక్సర్లతో 173 పరుగులు చేయడం అతడి ప్రతిభకు నిదర్శనం. అదే రోజు బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున ఆడుతున్నట్టు ప్రకటన విడుదల చేయడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 44 మ్యాచుల్లో 5 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేయగా.. లీగ్ మ్యాచుల్లో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు, టీ20 మ్యాచుల్లో 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేసిన ఘనత ఇషాన్ కిషన్‌దే.
సూర్యకుమార్ యాదవ్.. 2010లోనే ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఇతడు అదే జట్టులో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో 2011-13, 2018-21 వరకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. మధ్యలో 2014-17 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్‌లో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచులు ఆడిన ఇతడి టాప్ స్కోర్ 200కాగా.. మొత్తం 10 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. లీగ్ మ్యాచుల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేయగా.. టీ20లో 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పదేండ్లుగా తనను తాను నిరూపించుకోవడంతో బీసీసీఐ ఈ ఏడాది అంతర్జాతీయ అరంగేట్రంకు అవకాశం ఇచ్చింది. పలు సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో తాను సెలెక్ట్ కాలేదన్న వ్యథను సూర్య కుమార్ బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో సెలక్ట్ చేయకపోవడంపై కూడా స్పందించాడు. అయితే, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చిందని సత్తా చాటాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
రాహుల్ తెవాటియా.. మరో యువరాజ్ సింగ్‌గా భారత అభిమానులు పిలుచుకుంటున్నారు. ఎందుకంటే గత ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుత పంజాబ్) కింగ్స్ భారీ స్కోరు చేసిన సమయంలో.. అతి క్లిష్ట పరిస్థితుల్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన తెవాటియా ఆటకు.. ఎక్కడ ఆరో సిక్సు కొడుతాడో అని.. తన రికార్డును బద్ధలు కొడుతాడా అన్న అనుమానం కలిగిందంటూ స్వయంగా యువరాజ్ సింగ్ సరదాగా కామెంట్ చేశాడు. యువరాజ్ సింగ్ సైతం అతడి ఆటకు ముగ్దుడయ్యాడంటే ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. అంతేకాదు, తెవాటియా బౌలింగ్‌లో కూడా చక్కగా రాణిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కేవలం 7 మ్యాచులే ఆడిన ఇతడు.. 190 పరుగులు చేశాడు. 21 లీగ్ మ్యాచుల్లో 484 పరుగులు సాధించి.. 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 66 టీ20ల్లో 914 పరుగులు చేయగా.. అందులో రెండు అద్భుత హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికొస్తే బెస్ట్ బౌలింగ్ 7/98, 3/27, 3/18గా ఉన్నాయి. అయితే, గత దేశవాలీ ఆటల్లో అద్భుతంగా రాణించిన ఈ నలుగురు అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలా రాణిస్తారో అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు