- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అరె ఓ చిచ్చా.. నేనో బచ్చా’ అంటున్న రాహుల్ సిప్లిగంజ్

X
దిశ, సినిమా: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. సింగర్‌గా రాణిస్తూనే మరోవైపు బిజినెస్‌లోనూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ‘ఊకోకాకా’ పేరుతో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, సిద్దిపేటలో క్లాత్ స్టోర్స్ ఓపెన్ చేసిన రాహుల్.. త్వరలో వెండితెరపైనా సందడి చేయనున్నాడు. మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో వస్తున్న ‘చిచ్చా’ చిత్రంలో రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాలోని ‘అరె ఓ చిచ్చా’ అనే సాంగ్‌ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు మ్యూజిక్ అండ్ లిరిక్స్ వెంగీ అందించగా, టైటిల్ సాంగ్‌ను రాహుల్‌తోనే పాడించడం విశేషం. అయితే హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Next Story