- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ ప్రభుత్వం మిస్సింగ్ : రాహుల్ సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20,27,075కి చేరుకోగా, ఇప్పటి రకు 41,585 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కొవిడ్-19 బాధితుల సంఖ్య 20 లక్షలు దాటినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘మొద్దునిద్ర’ వీడటంలేదని ఆయన విమర్శించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. మోడీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కనిపించకుండా పోయిందని రాహుల్ సెటైర్లు వేశారు. కరోనా కేసులను నిలువరించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ గతనెల 17న తాను పోస్టు చేసిన ఓ ట్వీట్‌ను కూడా ఆయన దీనికి ట్యాగ్ చేశారు. కరోనా విజృంభణ ఇదే స్థాయిలో కొనసాగితే.. ఆగస్టు 10 నాటికి దేశంలో కేసుల సంఖ్య 20 లక్షలు దాటుతుందని ఆయన సదరు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.