అదో విఫల ప్రయోగం

by  |
అదో విఫల ప్రయోగం
X

దిశ వెబ్ డెస్క్: ప్రధాని మోడిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీ ఓ విఫల ప్రయోగమని ఆయన విమర్శించారు. జీఎస్టీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై మూకుమ్మడి దాడి అని అభివర్ణించారు. దేశ జీడీపీ కుంచించుకు పోవడానికి జీఎస్టీ అమలే కారణమని విరుచుకుపడ్డారు. జీఎస్టీ అంటేనే ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అని ఆయన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. దీంతో లక్షలాది మంది జీవితాలు గందరగోళానికి గురయ్యాయని అన్నారు. పన్నులు ఎగ్గొట్టేందుకు బడాబాబులకు కేంద్రం అవకాశం కల్పించందన్నారు. జీఎస్టీ ఆదాయం సమకూర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. దీంతో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆయన అన్నారు.



Next Story

Most Viewed