- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోశయ్యకు రాహుల్, రేవంత్ నివాళులు

X
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావుతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను రాహుల్‌కు కేవీపీ వివరించారు. టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి పార్టీ జెండాను రోశయ్య భౌతికకాయంపై ఉంచి నివాళులర్పించారు. రాష్ట్రంలోని పార్టీల నేతలంతా రోశయ్య కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్.. రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పార్టీలకతీతంగా సంతాపం ప్రకటించారు.
రోశయ్య సర్వజ హితాభిలాషి.. వెంకయ్య నాయుడు
- Tags
- Konijeti Rosaiah
Next Story