- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరు సీనియర్లకు జట్టు అండగా ఉంది : పరాస్ మాంబ్రే
దిశ, స్పోర్ట్స్: సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలకు టీమ్ ఇండియాలోని ప్రతీ ఒక్కరు అండగా ఉన్నారని కొత్త బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వ్యాఖ్యానించారు. గత కొద్ది కాలంగా వీరిద్దరూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముంబై టెస్టుకు కోహ్లీ తిరిగి జట్టుతో చేరుతుండటంతో సీనియర్లలో ఎవరో ఒకరిపై వేటు పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరాస్ మాంబ్రే మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘సీనియర్ క్రికెటర్లు అయిన పుజార, రహానేలకు టెస్టు క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్నది. ఎన్నో సార్లు కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును కాపాడారు. వీరిద్దరూ కలసి గెలిపించిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాళ్లు ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ లయను అందుకోవడానికి కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ చాలు. జట్టుగా అంతా వారికి అండగా ఉన్నాం. వాళ్లు పుంజుకుంటే భారత జట్టు బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ బలోపేతం అవుతుంది’ అని మాంబ్రే అన్నారు. బౌలింగ్ కోచ్ వ్యాఖ్యలు విన్న తర్వాత వారిద్దరినీ రెండో టెస్టులో కొనసాగించడం ఖాయమే అని తెలుస్తున్నది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పైన వేటు పడే అవకాశం ఉన్నది.