RRR :ఇవాళ రఘురామకృష్ణంరాజు రిలీజ్?

by srinivas |   ( Updated:2021-05-23 05:01:09.0  )
MP Raghurama Krishnam Raju
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్టంరాజు సికింద్రాబాద్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లోనే ఉన్నారు. వారంరోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండగా.. ఇవాళ సాయంత్రం ఆయనను విడుదల చేసే అవకాశముంది. ఇవాళ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది రఘురామకృష్ణంరాజును కలిశారు.

రఘురామకృష్ణంరాజు ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇవాళ కింది కోర్టులో రఘురామకృష్ణంరాజు బెయిల్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఆ ఆర్డర్ వచ్చేందవరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామకృష్ణంరాజు ఉండనున్నారు.


Advertisement
Next Story

Most Viewed