ఉద్దీపన చర్యలు అవసరం : రఘురాం రాజన్

by Harish |
ఉద్దీపన చర్యలు అవసరం : రఘురాం రాజన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సవాళ్లు (Financial challenges) ఉన్నప్పుడే ఉద్దీపన చర్యలు (Stimulus actions) చేపట్టాలని, లేదంటే ఆర్థిక వ్యవస్థ (Economy) పూర్తిగా కుప్పకూలే ప్రమాదముందని ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ (Economist, former governor of RBI) రఘురాం రాజన్ హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు (Country GDP growth rate) కుంచించుకుపోవడం ఆందోళనకరమని రాజన్ తెలిపారు. లింక్‌డ్ ఇన్ పేజ్‌ (Linked in page)లో అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం అర్థవంతమైన చర్యలను తీసుకుని ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలన్నారు.

ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇదివరకటి కంటే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేయాలని రాజన్ పేర్కొన్నారు. కొవిడ్-19 (Kovid-19) అత్యధిక ప్రభావానికి గురైన అమెరికా వృద్ధి రేటు 12.4 శాతం, ఇటలీ 9.5 శాతం ప్రతికూలంగా ఉన్నాయని, ఈ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరోనా వ్యాప్తి దేశంలో మరింత వేగంగా విస్తరిస్తోందని, ఇలాంటి సందర్భంలో వివేకంతో వ్యవహరించాలన్నారు. అయితే, ఈ పరిస్థితుల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం పొదుపు చర్యలను అవలభిస్తున్నట్టు తెలుస్తోందని, దానివల్ల స్వీయ ఓటమీకి దారి తీస్తాయని హితవుపలికారు.

ఆటో పరిశ్రమ (Auto industry) సాధిస్తున్న పునరుజ్జీవనం వాస్తవ వృద్ధి రేటును సూచించదని, దేశ వృద్ధిరేటు పూర్తిస్థాయిలో క్షీణిస్తే అన్ని రంగాల్లో డిమాండ్ దిగజారుతుందన్నారు. ఇప్పటివరకు సంస్కరణలు అసంపూర్తిగా ఉన్నాయి. తక్షణమే అమలు చేయకపోయినప్పటికీ, అమలు సంబంధించి ప్రత్యేక కార్యాచరన ప్రకటిస్తే ఇన్వెస్టర్ల (Investors)లో భరోసా ఉంటుందన్నారు.

Advertisement

Next Story