లాకప్ డెత్ జరుగలేదు : బాపట్ల డీఎస్పీ

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్‌లో రాఘవేంద్ర అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని, రాత్రంత స్టేషన్‌లో ఉంచి కొట్టినట్టు సమాచారం. దీంతో ఆ దెబ్బలకు ఆయన మృతిచెందినట్టు పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ, రేపల్లె స్టేషన్‌లో లాకప్ డెత్ జరగలేదని అన్నారు.

రేపల్లెలో పలువురు చిరు వ్యాపారుల వద్ద రాఘవేంద్ర మోసాలకు పాల్పడ్డాడని, ఆ చిరు వ్యాపారుల ఫిర్యాదు మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలతో రాఘవేంద్ర ఇబ్బంది పడ్డాడని, కోవిడ్ టెస్ట్ చేసేందుకు పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ఊపిరి ఆడక రాఘవేంద్ర మృతి చెందాడన్నారు.

Advertisement