తమ్ముడికి లారెన్స్ సర్‌ప్రైజ్!

by  |
తమ్ముడికి లారెన్స్ సర్‌ప్రైజ్!
X

డైరెక్టర్, కొరియోగ్రఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్.. ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకున్నారు. వికలాంగులకు సైతం చేయూతనిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ బంధానికి విలువనిచ్చే లారెన్స్‌కు తమ్ముడు ఎల్విన్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. తను కోరిన ప్రతీ ఒక్కటి అందిస్తూ ఆనందాన్ని పొందే రాఘవ.. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎల్విన్ బర్త్ డే‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఎల్విన్ కలను సాకారం చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ అందించిన లారెన్స్.. నటుడిగా మారాలన్న ఎల్విన్ కోరిక తీరబోతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తమ్ముడిని హీరోగా లాంచ్ చేసేందుకు మంచి స్క్రిప్ట్ కూడా సెలెక్ట్ చేసినట్లు వెల్లడించాడు. రాఘవేంద్ర ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమాకు రాజా దర్శకత్వం వహిస్తారని తెలిపాడు. కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందుతూ పరిస్థితులు సాధారణం కాగానే షూటింగ్ మొదలవుతుందని.. తనను ఆశీర్వదించాలని కోరాడు.


Next Story

Most Viewed