- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వింబుల్డన్, ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న రఫెల్ నదాల్
దిశ, స్పోర్ట్స్: స్పెయిన్ బుల్, వరల్డ్ నెంబర్-3 రఫెల్ నదాల్ వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 20 గ్రాండ్‌స్లామ్స్ గెల్చి.. రికార్డు స్థాయిలో 21వ ఫీట్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన నదాల్.. సెమీఫైనల్‌లో నోవాక్ జకోవిచ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. జులై 23 నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ బరిలో అయినా ఈ రికార్డు సాధిస్తాడని రఫా అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వింబుల్డన్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ బరిలో నుంచి కూడా తప్పుకుంటున్నట్లు గురువారం ట్విట్టర్‌లో వెల్లడించాడు.
‘నేను వింబుల్డన్, ఒలింపిక్స్‌లో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభమైనది ఏమీ కాదు. అయితే నా శరీరం మాట నేను వినాలి. నా టీమ్‌తో పూర్తిగా చర్చించాను. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నాను. నేను నా కెరీర్‌ను సుదీర్ఘ కాలం ఉండాలని కోరుకుంటున్నాను. నేను టెన్నిస్ ఆడుతుంటడమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నా ప్రొఫెషనల్, పర్సనల్ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రధాన్యత ఇస్తాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ మధ్య కేవలం రెండు వారాలే నాకు సమయం ఉన్నది. అంత తక్కువ వ్యవధిలో నా శరీరం తిరిగి క్లే కోర్టు నుంచి గ్రాస్ కోర్టుకు సహకరించేలా తయారు కాలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను రెండు నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. నా కెరీర్‌లో ఇది కీలకమైన సమయం. కాబట్టే అత్యున్నత స్థాయిలో పోరాడటానికే ఈ విరామం తీసుకుంటున్నాను. నా కోసం లండన్, టోక్యోలో ఎదురు చూస్తున్న నా అభిమానులకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక క్రీడాకారుడిగా నాకు ఒలింపిక్స్ చాలా ముఖ్యం. ప్రపంచంలోని ప్రతీ అథ్లెట్ అలాంటి కలనే కంటుంటాడు. నేనూ నా దేశం తరపున ఒలింపిక్స్‌లో జెండా పట్టుకొని నడవాలని ఉంది. ఆ గౌరవాన్ని దక్కించుకోవాలని ఉంది. కానీ అలా చేయలేకపోతున్నాను’ అంటూ ట్విట్టర్‌లో సుదీర్ఘంగా పోస్టు పెట్టాడు.