- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీ కంటెంట్‌తో బాలీవుడ్‌కు ఎఫెక్ట్?
దిశ, సినిమా: హాట్ బ్యూటీ రాధికా ఆప్టే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ కంటెంట్ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. ఓటీటీ ప్రపంచవ్యాప్తంగా అనుకూలమైన వేదికగా మారిందన్న భామ.. దేశంలో ముఖ్యమైన మాధ్యమంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. ఇవి ప్రేక్షకులు చూడాలనుకుంటున్న కంటెంట్‌ను ఆస్వాదించేలా చేస్తున్నాయని, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడంలోనూ ముందున్నాయని చెప్పింది. ఇది మంచి పరిణామమన్న రాధిక.. ఓటీటీకి ఏర్పడిన క్రేజ్ బాలీవుడ్‌పై ఎఫెక్ట్ చూపుతుందో లేదో తెలియదు కానీ, రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా సూపర్ డెవలప్‌మెంట్ ఉంటుందని తెలిపింది.
ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్ హెల్తీ కాంపిటీషన్ తీసుకొచ్చిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను పోల్చుకోగలుగుతున్నామని తెలిపింది. ఇక వెబ్ వరల్డ్‌లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయని, ఈ సంఖ్య లాక్‌డౌన్ నుంచి పెరిగిందని చెప్పిన భామ.. మరి ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో చూడాలంది. ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని దొరుకుతుందనేది మాత్రం వాస్తవమని, భవిష్యత్తులో అది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది.