ప్రేమికుల రోజునే ప్రభాస్ గుడ్ న్యూస్

by Shyam |   ( Updated:2024-07-02 14:58:04.0  )
ప్రేమికుల రోజునే ప్రభాస్ గుడ్ న్యూస్
X

దిశ, సినిమా: వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టైట్ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కో సినిమా షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నారు. వీటిలో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా, ఇటీవలే తన షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేసినట్లు పేర్కొంది పూజ. ఇప్పటికే రిలీజైన మూవీ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ గురించి మేకర్స్ ప్రకటించడం విశేషం.

త్వరలోనే మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించడంతో.. సినిమా టీజర్ ఎప్పుడు విడుద‌ల అవుతుందా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా ఈ నెల 14న వాలంటైన్స్ డే కానుకగా ‘రాధేశ్యామ్’ ప్రీ టీజర్‌లో విక్రమాదిత్య, ప్రేరణకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

Next Story