- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘రాధే శ్యామ్’ రోమియో టైప్ కాదు..

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీరియాడిక్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. వాలెంటైన్స్ డే కానుకగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ విడుదలైన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఓ రైల్వే స్టేషన్‌లో హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రభాస్ స్పానిష్ భాషలో తన లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయగా.. చిరునవ్వుతో సమాధానం ఇవ్వకుండానే వెళ్తుంది పూజ. ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన హీరోను ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని అడుగుతుంది. దానికి సమాధానంగా ‘ఛ వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’ అని చెప్తాడు.
మొత్తానికి ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ ప్రేక్షకులకు కొత్త లవ్ ప్రపోజ్ డైలాగ్‌ను పరిచయం చేయడంతో పాటు ప్రేమకోసం చావడం కాదు చంపేస్తాను అనే హీరో తెగువను చూపించగా.. బెస్ట్ రెస్పాన్స్ వస్తోంది. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జూలై 30న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.