షాకిచ్చిన రాధే శ్యామ్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-11-15 10:31:10.0  )
షాకిచ్చిన రాధే శ్యామ్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ట్రెండింగ్‌లో రాధేశ్యామ్.. ఇందులో కొత్తేముంది. అప్‌డేట్ వస్తుందంటే ఏ సినిమా అయినా ట్రెండ్ అవుతుందని అందరూ అనుకుంటారు. అయితే రాధేశ్యామ్ మాత్రం ఈ సారి అప్‌డేట్ ఇస్తూ కాదు.. ఆలస్యం చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను రాధేశ్యామ్ మళ్లీ నిరాశపరిచింది. సోమవారం ఎనిమిది గంటలకు ఫస్ట్‌ సింగిల్‌ లిరికల్‌ రిలీజ్‌ చేస్తామని మూవీ టీం ఎనౌన్స్‌ చేసింది. కానీ టెక్నికల్‌ ఇష్యూ వల్ల రిలీజ్‌ చేయలేకపోతున్నామంటూ యూవీ క్రియేషన్ అధికారికంగా ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే మిగిలింది.

రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్స్‌ లేవని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు.. కనీసం ఫస్ట్‌ సింగిల్‌లో‌ లిరికల్‌ రిలీజ్‌ చేస్తారన్న వార్త తెలిసి.. ఫుల్‌ ఖుషీ అయ్యారు. కానీ వారి గాలి తీసేసినట్లు ఫస్ట్‌ సింగిల్ లిరికల్‌ రిలీజ్‌ చేయలేకపోతున్నాం అని చెప్పింది మూవీ టీం. యూవీ క్రియేషన్స్‌ నుంచి వచ్చిన ఈ ట్వీట్‌ చూసి.. సోషల్‌ మీడియాలో ఫుల్‌ మీమ్స్‌ చేస్తున్నారు నెటిజెన్స్‌..

మెున్ననే ఒక ఫ్యాన్‌ రాధే శ్యామ్ నుంచి ఎటువంటి అప్‌డేట్స్‌ లేవని.. తన సూసైడ్‌కి కారణం రాధేశ్యామ్ టీం అని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కనీసం అటువంటి ప్రభాస్‌ డై హార్ట్‌ ఫ్యాన్స్‌ కోసం ఈసారైనా మంచి అప్‌డేట్‌తో రాధేశ్యామ్ ముందుకు వస్తుందని ఆశిద్దాం.

కండోమ్ కొంటే కారు ఫ్రీ

Advertisement

Next Story

Most Viewed