ముంబైలోనే ‘రాధే’ షూటింగ్

by Jakkula Samataha |
ముంబైలోనే ‘రాధే’ షూటింగ్
X

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌ ‘రాధే’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అట్లూరి అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చింది. మరికొన్ని రోజుల్లో పూర్తవుతుందన్న దశలో కరోనా ప్రభావంతో బ్రేక్ పడింది. అయితే ఆగస్టు నుంచి చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. సల్మాన్ తన ‘ఈద్’ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయడానికి.. రంజాన్‌ పండుగ రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేసినా.. లాక్‌డౌన్‌ వల్ల రిలీజ్‌ వాయిదా పడింది. షెడ్యూల్ ప్ర‌కారం భారీ పోరాటఘట్టాలతో పాటు ఓ పాటను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించాలని సన్నాహాలు చేశారు. కానీ ప్రస్తుతం విదేశీ రాకపోకలపై నిషేధం కొనసాగుతున్న నేప‌థ్యంలో ముంబైలోని ఓ స్టూడియోలోనే మొత్తం షూటింగ్‌ను పూర్తిచేస్తున్నారు.

ప్రధానంగా యాక్షన్‌ ఎపిసోడ్స్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. అజర్‌బైజాన్‌ లొకేషన్‌ను ప్రతిబింబించేలా ఓ సెట్‌ను తీర్చిదిద్దబోతున్నారు. కేవలం పదిశాతం మాత్రమే షూటింగ్‌ మిగిలి ఉండటంతో నెలరోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసి.. నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దిశా పటానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రణ్‌దీప్‌ హుడా, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఇందులో ఓ పాత్ర కోసం మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారు. ఇప్పటికే ‘శాటిలైట్‌ శంకర్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా.. సల్మాన్‌ మూవీలో ఆఫర్‌‌ దక్కడంతో ఫుల్ ఖుష్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed