‘రాధాకృష్ణ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కీలక పాత్రలో లక్ష్మీపార్వతి

by Shyam |
‘రాధాకృష్ణ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కీలక పాత్రలో లక్ష్మీపార్వతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఢమరుకం’ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి..స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. నందమూరి లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకులు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమాను వచ్చే నెల 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం సమకూర్చిన సినిమాలో అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story