- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చోరీలపై స్పందించిన రాచకొండ సీపీ
దిశ, క్రైమ్ బ్యూరో: నగర శివారులో వరుసగా జరుగుతున్న ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నది అంతరాష్ట్ర ముఠాకు చెందినవారేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస ఏటీఎం చోరీలపై సీపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎల్బీనగర్ కాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న ముఠాను హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠానే అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఏటీఎం కేంద్రాల్లో నిర్వాహణ లోపాల కారణంగానే చోరీలకు గురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారం తదితర సదుపాయాలను సంబంధిత బ్యాంకులు కల్పించకపోవడం వల్లే జరిగాయని వెల్లడించారు. ఈ లోపాలను గుర్తిస్తున్న దుండగులు చోరీలకు సులభంగా పాల్పడి లక్షల రూపాయలను దోచుకుంటున్నారని తెలిపారు. ఏటీఎం కేంద్రాల వద్ద నిబంధనలు పాటించని బ్యాంకులకు నోటీసులు అందజేస్తామన్నారు.