- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఆర్.కృష్ణయ్య
దిశ, ముషీరాబాద్ : తొలగించిన 7610 ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కార్యాలయ ముట్టడికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకారణంగా విధుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై 21 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉద్యమాన్ని రాజకీయం చేయలేదని, ఫీల్డ్ అసిస్టెంట్లను వీధుల్లో చేర్చుకోకపోతే రాజకీయ పరమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.