- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుంబ్లే రికార్డు బద్దలు కొట్టే సత్తా అశ్విన్‌కు ఉంది : జహీర్ ఖాన్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రెండు మూడేళ్లలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించడం ఖాయమని మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ కనుక ఇదే ఫామ్‌లో మరి కొన్నేళ్లు ఆడితే తప్పకుండా మరిన్ని రికార్డులు బద్దలు అవుతాయని ఆయన అన్నాడు. న్యూజీలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కీలకంగా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో హర్బజన్ సింగ్ (417) రికార్డును అధిగమించాడు.
రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో కనుక ఇలాగే రాణిస్తే కపిల్ దేవ్ రికార్డు బద్దలు కావడం ఖాయమే. ‘అశ్విన్ గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అతడి పనై పోయింది అనుకున్న ప్రతీ సారి యువ క్రికెటర్ల మాదిరిగా దూసుకొని వస్తుంటాడు. అతడి బౌలింగ్‌లో ఎప్పుడూ వైవిధ్యం ఉంటుంది. ఎంతో కచ్చితత్వంతో బంతులు విసురుతూ మంచి ఫామ్‌లో ఉంటున్నాడు. ఇదే ఫామ్ మరి కొన్నేళ్లు కొనసాగిస్తే కచ్చితంగా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు కొడతాడు’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.