ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన చేపట్టండి

by Shyam |
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన చేపట్టండి
X

దిశ, నిజామాబాద్: వేల్పూర్ మండలం మోతే గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగితే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అంతకు ముందు మండలం కేంద్రం‌లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించిన మంత్రి వేముల తన ఇంటి పైన పార్టీ జెండా ఎగురవేశారు.

Tags: minister prashanth reddy, paddy purchase centre, opening, mothy



Next Story