- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యారీ, మేఘన్ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్నాం: క్వీన్ ఎలిజబెత్
లండన్ : బ్రిటీష్ రాజదంపతులు హ్యారీ, మేఘన్‌లు ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా రాజకుటుంబీకులు తమకు పుట్టబోయే బిడ్డ రంగుపై ఆందోళనలు వెలిబుచ్చారన్న వ్యాఖ్య చర్చనీయాంశమైంది. అంతర్జాతీయంగా ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగింది. తాజాగా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూపై క్వీన్ ఎలిజబెత్ ఓ ప్రకనట చేశారు. హ్యారీ, మేఘన్‌లకు గతకొన్నేళ్లు గడ్డుకాలంగా గడిచాయని తెలిసి చింతిస్తున్నామని పేర్కొన్నారు. వారు లేవనెత్తిన జాతి గురించిన వ్యాఖ్యలు తమకు ఆందోళన కలిగించాయని తెలిపారు. వీటిని తాము సీరియస్‌గా తీసుకున్నామని, ఈ విషయంపై వారితో ప్రైవేట్‌గా చర్చిస్తామని వివరించారు. హ్యారీ, మేఘన్, వారి కుమారుడు ఆర్చీ ఎప్పటికీ ప్రియమైన కుటుంబీకులుగానే కొనసాగుతారని క్వీన్ ఎలిజబెత్ తరఫున బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అమెరికాకు వెళ్లిన హ్యారీ, మేఘన్ దంపతులు ఆదివారం ఓప్రా విన్‌ఫ్రేకు ఇంటర్వ్యూనిచ్చారు. ఇందులో సంచలన విషయాలను వెల్లడించారు. ఆ ప్యాలెస్‌లో ఉన్న సమయంలో నిరాధారణకు గురయ్యారని, ఒక్కోదశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ తనను చుట్టుముట్టాయని మేఘన్ తెలిపారు. తమకు పుట్టబోయే బిడ్డ ముదురు రంగులో జన్మిస్తాడేమోనన్న రాజకుటుంబీకులు ఆందోళనపడినట్టు తెలిసిందని, అది బాధించిందని వివరించారు. తాము అధికారిక వివాహానికి మూడు రోజుల ముందే మనువాడినట్టు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. 1997లో ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత ఈ ఇంటర్వ్యూనే రాచకుటుంబాన్ని ఇరుకునపడేసింది. ప్రిన్స్ హ్యారీ తల్లి డయానా మరణం తర్వాత లేట్‌గా స్పందించిన రాజకుటుంబంపై విమర్శలు వచ్చాయి.