ఖైదీలకు కోవిడ్ క్వారంటైన్ కిట్లు

by  |
ఖైదీలకు కోవిడ్ క్వారంటైన్ కిట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి సబ్ జైలులో కరోనా బారిన పడిన 54 మంది ఖైదీలకు ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ కిట్లను అందజేశారు. మంగళవారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా బాధితులను పరామర్శించారు. అనంతరం కోవిడ్ కిట్లను అందించి మాత్రలు, కషాయం వంటి వాటి వాడకాన్ని తెలియజేశారు.

సబ్ జైలులోని మొత్తం ఖైదీలకు పౌష్టికాహారం కోసం అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందించనున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో కరోనా బాధితులకు రోగనిరోధక శక్తిని పెంపొందించే ఫుడ్ మెనూ ను సబ్ జైలు ఖైదీలకు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ మెనూలో కషాయం, అల్లం టీ, పసుపు కలిపిన పాలు, కోడిగుడ్డుతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, సబ్ జైలు జైలర్, డిప్యూటీ జైలరు పాల్గొన్నారు.


Next Story

Most Viewed