- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ దేశంలో పొలాలు.. అద్భుత కళాక్షేత్రాలు

దిశ, వెబ్‌డెస్క్: పొలం.. రైతుకు అత్యంత ఇష్టమైన క్షేత్రం. ఆరుగాలం శ్రమించి అన్నదాత పొలంలో వరి పంట పండిస్తారు. అయితే కొందరు రైతన్నలు ఈ పంట పొలాలను అద్భుతమైన కాన్వాస్‌గా మలుచుకుని..అపురూపమైన, అందమైన చిత్రాలకు వేదికగా నిలుపుతారు. మనదేశంలో ఇలాంటి పంట చిత్రాలను అనేకం చూశాం. కానీ, జపాన్‌లోని ఇనాకాడెట్ అనే ఓ చిన్న గ్రామంలో మాత్రం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వరి క్షేత్ర కళారూపాలు దర్శనమిస్తాయి.
ఇనాకాడెట్ గ్రామ జనాభా కేవలం 7 వేలు మాత్రమే. కానీ ఆ గ్రామానికి వచ్చే సందర్శకుల సంఖ్య మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలోనే ఉంటుంది. 1990 తర్వాత ‘రైస్ ఫీల్డ్ ఆర్ట్’ కారణంగా ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రానికి కేరాఫ్ అడ్రస్‌లా మారింది. గ్రామంలోని యువకులు పట్టణ కేంద్రాలకు తరలివెళుతుండటంతో, స్థానిక అధికారులు ఆ విషయాన్ని గ్రహించి, గ్రామంలోని వలసలను ఆపాలనుకున్నారు. అందుకోసం వందలాది ఏళ్లుగా అక్కడి రైతులు అవలంభించే ‘రైస్ ఫీల్డ్ ఆర్ట్’ను మార్గంగా వాడుకున్నారు. టాన్బో ఆర్ట్ (రైస్ ఫీల్డ్ ఆర్ట్) అని పిలవబడే ఈ ఆర్ట్ ఫామ్‌లో రైతులు తమ పొలాలను గెయింట్ కాన్వాసులుగా మార్చడానికి వివిధ రంగుల బియ్యం రకాలను ఉపయోగిస్తారు. ఆ పొలాలను చూస్తే నిజంగా పికాసో చిత్రాలు చిన్నబోయేలా కనిపిస్తాయి. ఆ కళాఖండాలను పైనుంచి చూస్తే ముగ్ధులమైపోవాల్సిందే. పర్పుల్, ఎల్లో వరి మొక్కలను ఉపయోగించి మొట్టమొదటి వరి క్షేత్ర కళాకృతిని 1993లో ఆవిష్కరించారు. వరిపొలాలను ఎంతో అత్యద్భుతమైన చిత్రాలుగా మలుస్తున్నారు. కాగా, వీటిని చూడాలంటే ఓ ఎత్తయిన వేదిక కావాలి. అందుకు రైస్ ఫీల్డ్ సమీపంలోని మౌంట్ ఇవాకిని ఉపయోగించుకున్నారు. ఈ కళాకృతులు సందర్శకులను ఆకట్టుకోవడంతో, ఇనాకాడేట్ అధికారులు దీన్నీ వార్షిక కార్యక్రమంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఆకట్టుకునే భారీ వరి క్షేత్ర కళాకృతులను రూపొందించడానికి, స్థానికులు జపాన్‌కు ప్రత్యేకమైందిగా మార్చడానికి ఎంతో శ్రమిస్తూ తమవైన కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. గత మూడు దశాబ్దాలలో టాన్బో కళ మరింత అభివృద్ధి చెందగా, పెద్దవి, మరింత క్లిష్టమైన క్షేత్ర కళాకృతులను సృష్టిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవాన్ని చూడ్డానికి ప్రపంచదేశాల నుంచి సందర్శకులు వస్తుండగా, మొత్తంగా ఏడాదిలో 5 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు.