- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాపూర్‌నగర్‌లో జనాలను బయపెట్టిన కొండ చిలువ
by Sridhar Babu |

X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకర్గం షాపూర్‌నగర్‌లో కొండ చిలువ సంచారం కలకలం రేపింది. బుధవారం ఉదయం స్థానిక హమాలీ అడ్డాలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. పనుల కోసం అడ్డా మీదకు వచ్చిన హామాలీలు భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను చూసి భయాందోళనతో పరుగులు పెట్టారు. వెంటనే జీడిమెట్ల సీఐ బాలరాజుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్నేక్ సొసైటీ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాగ్రత్తగా కొండ చిలువను ఓ సంచిలో బంధించి సంబంధిత అధికారులకు అప్పగించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story