‘బహుభాషా కొవిదుడుగా పీవీకి నామకరణం’

by  |
‘బహుభాషా కొవిదుడుగా పీవీకి నామకరణం’
X

దిశ, రంగారెడ్డి: మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పివీ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వతంత్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా సేవలందించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. స్వర్గీయ పీవీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని అన్నారు. దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశ భవిష్యత్తును మలుపు తిప్పాయని అన్నారు. ఎన్నో రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్ధిక, పారిశ్రామిక, మానవ వనరుల రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నేటి పాలకులకు, నేటి తరానికి పీవీ మార్గదర్శకులని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు హరీశ్, ప్రతీక జైన్, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story