కార్మికుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం: పువ్వాడ అజయ్

by Sridhar Babu |
కార్మికుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం: పువ్వాడ అజయ్
X

దిశ‌, ఖ‌మ్మం: కార్మికుల సంక్షేమ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్‌ కుమార్ అన్నారు. మే డేను పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఖ‌మ్మంలో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వివిధ రంగాల్లో పని చేస్తున్న 5 వేల మంది కార్మికులకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం అజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తోంద‌ని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి అజయ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో మున్సిపల్ కార్మికులు ముందుండి పోరాటం చేస్తున్నార‌ని కొనియాడారు. మే డే రోజు వారితో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందని మంత్రి అజయ్ తెలిపారు.

tag: puvvada ajay, may day celebrations, khammam

Advertisement

Next Story