పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

by Sridhar Babu |
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
X

దిశ, ఖమ్మం: పరిసరాల పరిశుభ్రత ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిశుభ్రతను చేపట్టారు. ఖమ్మంలోని తన ఇంటి పరిసరాల్లోని పూల కుండీల్లో నిల్వ ఉన్న నీరును శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

Advertisement

Next Story