ఖ‌మ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజ‌య్‌ ప‌ర్య‌ట‌న‌

by Sridhar Babu |
ఖ‌మ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజ‌య్‌ ప‌ర్య‌ట‌న‌
X

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజ‌య్‌ కుమార్ గురువారం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్స‌వం, కూర‌గాయ‌ల పంపిణీ, క‌రోనాపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కామేపల్లి మండలం పండితాపురం, బోనకల్, ముష్టికుంట గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించారు. మార్గం మ‌ధ్యలోని బోనకల్-వత్సవాయి రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్ పోస్ట్‎ను త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ తర్వాత వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలంలోని మల్లుపల్లి గ్రామంలో వలస కూలీలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మార్క్‎ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Puvvada Ajay Kumar, visit, khammam, distributes, Essential commodities



Next Story

Most Viewed