- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాదర్ డైలాగ్స్‌ను కొడుకు ‘పూరి’స్తున్నాడు..
పూరీ జగన్నాథ్… సినిమాల్లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. పూరితో సినిమా చేస్తే చాలు.. మాస్ హీరోగా మారి కమర్షియల్ సక్సెస్ అందుకుంటామనుకుంటారు హీరోలు. అంతగా హీరోల పాత్రలు మాస్ డైలాగ్ లతో జనాల్లోకి దూసుకెళ్లేలా తీర్చిదిద్దుతారు పూరీ. ఫ్లాప్ సినిమాలతో కెరీర్ పడిపోతుంది అనుకున్న సమయంలో ఆ హీరోను మళ్లీ నిలబెట్టగల కెపాసిటీ పూరీ సొంతం. తొలి సినిమా బద్రితో పవన్ కళ్యాణ్ లో మాస్ యాంగిల్ ను చూపించిన పూరీ.. మహేష్ బాబును పండుగా ప్రమోట్ చేస్తూ పోకిరీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దేశ ముదురుతో బన్నీని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన ఆయనే… టెంపర్ తో తారక్ లో కొత్త కోణం చూపించాడు. ఇడియట్ సినిమా ద్వారా రవితేజను మాస్ మహారాజా గా చూపించాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో లవర్ బాయ్ రామ్ తో కలిసి ప్రేక్షకులకు ఊర మాస్ ఎంటర్టైనమెంట్ ఇచ్చిన పూరీ.. ప్రస్తుతం ఫైటర్ సినిమాతో విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
పూరి తన ప్రతీ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తానే అందిస్తాడు. అందుకే ఆ డైలాగ్స్ లో అంత పంచ్, పవర్ ఉంటుంది. ఈ లాక్ డౌన్ లో అలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు పూరీ కొడుకు ఆకాశ్, ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ లు.
రాహుల్ కాల్స్ ఆకాశ్ పేరుతో మేం సినిమా ప్రేమికులం.. అంతకు మించి పూరీ సినిమా లవర్స్.. వీడియో షేర్ చేసిన ఆకాశ్ పూరీ.. తన తండ్రి సినిమాలోని బద్రి డైలాగ్ తో కన్వర్జేషన్ స్టార్ట్ చేసి.. టెంపర్, దేశముదురు, పోకిరి, గోలీ మార్, బిజినెస్ మెన్, ఇడియట్ లాంటి సినిమా డైలాగ్ లతో కంప్లీట్ చేశారు. చివరగా.. ఖడ్గంలో ఒక్క చాన్స్ డైలాగ్ పై యాక్టింగ్ ఇరగదీసిన ఆకాశ్, రాహుల్.. భారీ కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు. ఈ వీడియో పై స్పందించిన పూరీ.. లవ్ యూ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.
We ❤️ cinema.
Extra love to @purijagan #RahulCallsAkash@ActorRahulVijay pic.twitter.com/4A9cyHtJu5— Akash Puri (@ActorAkashPuri) May 17, 2020