ఆ మూడు రోజుల్లో కొనుగోలు చేస్తాం…

by Shyam |
ఆ మూడు రోజుల్లో కొనుగోలు చేస్తాం…
X

దిశ, మెదక్:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో అవసరమైన అన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు మెదక్​ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్​ వెంకట్​ రామిరెడ్డి సూచించారు. మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో జిల్లా అధికారులు, రైస్​మిల్లర్లతో సమీక్షా సమావేశాన్ని ఆయన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ వెంకట్​ రామిరెడ్డి మాట్లాడుతూ… మెదక్​ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెదక్​ జిల్లాలో ఇప్పటికే 40 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. వీటన్నింటినీ మంగళ, బుధ, గురువారాల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్నీ బస్తాలు, తాళ్లు, రైతులకు అవసరమైన నీటి సౌకర్యాలు, ట్రాన్స్​ పోర్టింగ్​లను ఏర్పాటు చేయాలని అధికారులును కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed