ఉపాసనపై కేసు ఫైల్ చేసిన పోలీసులు

by Shyam |   ( Updated:4 May 2021 3:23 AM  )
ఉపాసనపై కేసు ఫైల్ చేసిన పోలీసులు
X

దిశ, సినిమా : ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ ఉపాసన సింగ్‌పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ టీమ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనగా.. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు చిత్రీకరణకు అధికారిక అనుమతి లేదని గుర్తించారు. మూవీ యూనిట్ కూడా అఫీషియల్ పర్మిషన్ డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేయకపోవడంతో ఉపసానతో పాటు ఇతర యూనిట్ సభ్యులపై కూడా కేసు ఫైల్ చేశారు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ వయొలెట్ చేసినందుకు గాను మోరిండా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఇంతకు ముందు కూడా ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్ కోసం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన జిమ్మీ షేర్‌గిల్ అండ్ యూనిట్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed