- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బాంబ్ పేల్చిన మాజీ ముఖ్యమంత్రి.. కొత్త పార్టీ పేరు ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఆ పార్టీకి ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేశామని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నదని వెల్లడించారు. అయితే, పార్టీకి సంబంధించిన ‘గుర్తు’ గురించి ఇంకా ఏమీ అనుకోలేదని, త్వరలోనే ప్రకటిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అయితే, కొత్త పార్టీ పేరును ప్రకటించడానికి ముందే ఏడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించినట్టు మాజీ సీఎం అమరిందర్ సింగ్ వెల్లడించారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రస్తుత పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్దూ మరియు అమరిందర్ సింగ్‌కు మధ్య కోల్డ్ వార్ నడవడంతో అధిష్టానం అమరిందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.
- Tags
- announce