రేవంత్ నువ్వు RSS నుంచే కదా వచ్చావ్.. కాంగ్రెస్ మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్

by Shamantha N |   ( Updated:2021-10-21 22:03:57.0  )
1222-
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ లో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. మాజీ సీఎం అమరీందర్ సింగ్ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తాను ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చానని, కానీ.. తనకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు సెక్యులరిజం, లౌకికవాదం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి పదేపదే మాట్లాడుతున్నారు.. కానీ, వారికి ఆ హక్కు లేదన్నారు. విమర్శలు చేసే ముందు తమ పార్టీలో ఏం జరుగుతుందో ఓసారి చూడాలన్నారు. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పనిచేస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. అదేవిధంగా సొంతంగా పార్టీ పెడుతానని, అవసరమైతే పలు పార్టీలతో పొత్తుపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed