కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

by Anukaran |   ( Updated:2020-09-24 20:10:24.0  )
కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (132) చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2020లో తొలి సెంచరీ నమోదు చేసింది రాహుల్ కావడం గమనార్హం. కాగా, ఇదే మ్యాచ్‌లో వన్ మ్యాన్ ఆర్మీలా చేలరేగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌‌గా నిలిచాడు.

తొలుత 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్.. తర్వాతి 33 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. వరుస సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. తన ఇన్నింగ్స్‌లో రాహుల్ 7 సిక్సర్లు, 14 ఫోర్లతో ఆర్సీబీ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఓ సమయంలో రాహుల్ రెండు సార్లు క్యాచ్ ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ చేజేతులారా విడిచాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంజాబ్ కెప్టెన్ పరుగుల వరద పారించాడు.

ఇది ఇలా ఉంటే ఐపీఎల్‌లో వేగవంతంగా 2 వేల పరుగుల మైలురాయిని రాహుల్ అధిగమించాడు. కేవలం 60 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 63 ఇన్నింగ్స్, గౌతమ్ గంభీర్ 68 ఇన్సింగ్స్‌లో ఈ రికార్డును చేరుకున్నారు.

Advertisement

Next Story