కష్టపడ్డాడు.. అనుకున్నది సాధించాడు

by  |
కష్టపడ్డాడు.. అనుకున్నది సాధించాడు
X

దిశ, వెబ్ డెస్క్: అనుకున్నది సాధించడం కోసం ఎన్నికష్టాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి సాధిస్తారు కొందరు. అనంత దియోఫోడే(16) అనే పదో తరగతి విద్యార్థి కూడా ఇదే కోవకు చెందినవాడు. ప్రతి రోజూ 22 కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లి చదువుకున్నాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 82.80 శాతం మార్కులు సాధించాడు. ఆ విద్యార్థిది మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని మారుమూల గ్రామం. ఆ విద్యార్థి విజయాన్ని అతని మాటల్లోనే..

‘‘ పదో తరగతి ప్రారంభం నుంచే కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలనుకున్నాను. పొద్దున్నే 4 గంటల నుంచి 6 గంటల వరకు చదువుకుని స్కూల్‌కు వెళ్లేవాడిని. మళ్లీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక రాత్రి 11 గంటల వరకు పుస్తకాలతో గడిపేవాడిని. ఇలా ప్రతిరోజు కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు నేను మంచి మార్కులు సాధించగలిగాను. ఏడు వరకు మా వూరిలోనే చదువుకున్నా. ఆపై తరగతుల కోసం పాన్‌షెట్ లోని స్కూల్‌లో చేరా. మా ఊరు నుంచి స్కూలు 11 కిలోమీటర్లు, మొత్తంగా రోజు 22 కిలోమీటర్లు ప్రతి రోజు నడిచి వెళ్లేవాడిని. చదువుకోవాలన్న ఆశయం ముందు నడక నాకు ఏమంత కష్టమనిపించలేదు.’’ అని దియోఫోడే అన్నాడు.


Next Story

Most Viewed