అంతరిక్షంలో ఆరు ఆస్టరాయిడ్స్

by Harish |
అంతరిక్షంలో ఆరు ఆస్టరాయిడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పూణెలోని ఓ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. అంతరిక్షంలో ఆరు ఆస్టరాయిడ్స్‌ను గుర్తించారు. అంతర్జాతీయ ఖగోళ పరిశోధకుల సమాఖ్య(IASC) సహకారంతో ‘ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్’ స్టార్ట్ చేసిన కలాం సెంటర్.. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుంచి దరాఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 3 వరకు కఠిన పద్ధతిలో స్టూడెంట్స్‌కు టెస్టులు, ఆ తర్వాత స్క్రీనింగ్ నిర్వహించారు. ఫైనల్‌గా ఈ క్యాంపెయిన్‌కు 22 మంది విద్యార్థులను సెలెక్ట్ చేశారు.

భూమి ఉపరితలంపైనున్న సమర్థవంతమైన ఆస్టరాయిడ్లను గుర్తించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ఈ నేపథ్యంలో గ్రహశకలాలకు సంబంధించిన డేటా ఆధారంగా విశ్లేషణ చేసి, అవి ఎక్కడ ఉంటాయో విద్యార్థులు గుర్తించాల్సి ఉంటుంది. కాగా విఖే పాటిల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు స్టూడెంట్స్ ఆర్య పులాటె, శ్రేయ వాఘ్మరే ప్రాథమికంగా ఆరు ఆస్టరాయిడ్లను కనుగొన్నారు. అంగారక, కుజ గ్రహం మధ్యలో ఈ ఆస్టరాయిడ్స్ ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఐదేళ్లు పట్టొచ్చని అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (IAU) తెలిపింది. ఈ గ్రహశకలాల ద్వారా అంతరిక్షంలోని గ్రహాల కదలికలు, వాటి పనితీరును ఈజీగా తెలుసుకోవచ్చని కలాం సెంటర్ వ్యవస్థాపకులు, ఏపీజే అబ్దుల్ కలాంకు సలహాదారుగా పనిచేసిన శ్రీజన్ పాల్ సింగ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed