గోదావరి తీరంలో పూజలకు బ్రేక్

by Sridhar Babu |
గోదావరి తీరంలో పూజలకు బ్రేక్
X

దిశ, కాటారం: కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో గోదావరి తీరంలో పూజలు నిలిపివేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే 1వ తేదీ వరకు కర్మలు బ్రాహ్మణ సేవా సంఘం స్వచ్ఛందంగా నిలిపి వేసింది. ఈ నెల 23 శుక్రవారం నుంచి మే ఒకటి వరకు బ్రాహ్మణులు ఎవరు అస్థికల విసర్జన, పిండప్రదానాలు చేయడం లేదని బ్రాహ్మణసంఘం ప్రతినిధులు తెలిపారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కరోనా ఉధృతంగా ఉండడంతో అక్కడి నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తుల రాక పోకలు ఉంటాయి. దీంతో గోదావరి తీరంలో భక్తుల రద్దీ వల్ల కరోనా వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని భావించిన బ్రాహ్మణ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు కూడా గోదావరి తీరానికి రావద్దని బ్రాహ్మణ సంఘం కోరింది.

Advertisement

Next Story

Most Viewed