క్రికెట్ ప్రేమికులను గౌరవిస్తా : పుజారా

by Shamantha N |
క్రికెట్ ప్రేమికులను గౌరవిస్తా : పుజారా
X

న్యూజిలాండ్ పర్యటనలో స్లో బ్యాటింగ్‌తో విమర్శలెదుర్కొన్న టీమ్ ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా.. తన బ్యాటింగ్ తీరుపై ఆసక్తికరంగా స్పందించాడు. ఎవరినో ఎంటర్‌టైన్ చేయడం తన లక్ష్యం కాదని, జట్టును గెలిపించడమే తన ప్రధాన కర్తవ్యమని అన్నాడు. విమర్శించే వారి కోసం తాను ఆడనని, పరిమిత ఓవర్ల క్రికెట్ చూసేవారికి నా ఆట అర్థం కాదని తెలిపాడు. దూకుడుగా ఆడలేననే మాట నిజం కాదని, తాను పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలనని చెప్పాడు. కాకపోతే క్రీజులో కుదురుకునేందుకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటానన్న విషయం తనకు కూడా తెలుసని..కానీ చిన్నప్పటి నుంచీ అలాగే ఆడుతూ పెరిగినట్టు వెల్లడించాడు.

Tags : Pujara, Newzealand series, Test Cricket, batting Technique

Advertisement

Next Story