ప్రిన్స్‌కు జోడీగా పూజ లేదా కియారా?

దిశ, వెబ్‌డెస్క్:
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో మహేశ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడని ఇప్పటికే తెలిసింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ సూపర్ హిట్ ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

అయితే ప్రిన్స్ పక్కన స్టెప్స్ వేసే ఐటెం గర్ల్ రాజకుమారిలా ఉంటే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ అభిప్రాపడుతున్నట్టు టాక్. రంగస్థలం సినిమాలో ఐటెం గర్ల్‌గా కూడా క్లిక్ అయిన పూజ హెగ్డేను కంటిన్యూ చేస్తే బాగుంటుందా? లేక ‘భరత్ అను నేను’ సినిమాలో తనతో జతకట్టిన కియారాను తీసుకుంటే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందా? అనే ఆలోచనలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ కానుండగా.. ఈ మాస్ బీట్‌కు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్స్ వేయించనున్నాడని సమాచారం.

Advertisement